దర్శకుడు రమేష్ వర్మ (Ramesh Varma) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఒక ఊరిలో’ ‘రైడ్’ వంటి యావరేజ్ సినిమాలు, ‘వీర’ ‘ఖిలాడి’ ‘అబ్బాయితో అమ్మాయి’ వంటి డిజాస్టర్ సినిమాలు ఇతని ఖాతాలో ఉన్నాయి. తమిళంలో హిట్ అయిన ‘రాట్ససన్’ ని ‘రాక్షసుడు’ గా రీమేక్ చేసి డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. ఇవి తప్ప రమేష్ వర్మ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు అంటూ ఏమీ లేవు. అయినప్పటికీ రమేష్ వర్మ క్రేజీ ఆఫర్స్ పడుతూనే ఉన్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంటే అసలు ఆఫర్స్ రావు. కానీ రమేష్ వర్మ (Ramesh Varma) అదృష్టం అలాంటిది.
అయితే టెక్నికల్ గా సినిమాని రిచ్ గా తీర్చిదిద్దడంలో రమేష్ వర్మ ముందుంటాడు. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమా అందించగలడు. అందుకే అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అతను రాఘవ లారెన్స్ ను హీరోగా ఓ ‘కాల భైరవ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది హిందీలో సూపర్ హిట్ అయిన ‘కిల్’ కి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కాదు. ఇదొక మాస్ యాక్షన్ మూవీ. లారెన్స్ కి హీరోగా మంచి మార్కెట్ ఉంది. కాబట్టి ఇది క్రేజీ ఆఫరే.
మరోపక్క ‘కిల్’ చిత్రాన్ని కూడా రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వం వహిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. మొదట వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని అంతా అనుకున్నారు. కానీ వరుణ్ మరో ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో.. ఇది చేయలేను అని తప్పుకున్నట్టు టాక్ నడిచింది. ఫైనల్ గా ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంపికయ్యాడట.
రమేష్ వర్మ- బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలయికలో ‘రాక్షసుడు’ వచ్చింది. తర్వాత ‘రాక్షసుడు 2’ కూడా అనౌన్స్ చేశారు. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ‘కిల్’ రీమేక్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా నటించబోతున్నాడు అని సమాచారం.