‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రమోషన్స్ టైంలో చిరంజీవి ఓ మాట ఎక్కువగా చెబుతూ వచ్చారు. ‘డైరెక్టర్స్ అందరూ ప్రీ ప్రొడక్షన్ పనులు బాగా చేయాలి. ముఖ్యంగా స్క్రిప్ట్ పక్కాగా రాసుకోవాలి. ప్రీ ప్రొడక్షన్ దశలో సీన్లు అనుకున్నట్టు రాకపోతే పేపర్లు మాత్రమే వేస్ట్ అవుతాయి. కానీ ఒకసారి సెట్స్ పైకి వెళ్ళాక సీన్ అనుకున్నట్టు రాలేదు అంటే.. నిర్మాతకి మొదటి నుండే కోట్లల్లో నష్టం వస్తుంది’ అంటూ చిరు (Chiranjeevi) చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ అనుభవం సంపాదించిన వ్యక్తి. ఆయన ఊరికే చెప్పరు కదా అలాంటి మాటలు.
ఇది పక్కన పెడితే.. కొడుకు సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) బడ్జెట్ ను ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరొందిన దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి దిల్ రాజు (Dil Raju) ముందుగా అనుకున్న బడ్జెట్ రూ.200 కోట్లు. కానీ సగం షూటింగ్ అవ్వకుండానే ఆ లెక్క క్రాస్ అయిపోయింది. ‘శంకర్ (Shankar) సినిమా అంటే గ్రాండియర్… గ్రాండియర్ అంటే శంకర్’ అనే విధంగా ఆయన సినిమాలకి నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తూ ఉంటారు.
50 వ సినిమా కాబట్టి.. దిల్ రాజు గ్రాండ్ గా చేయాలి అని శంకర్ దగ్గర ఫ్లోలో మాట వదిలారట. అలాంటప్పుడు శంకర్ తగ్గుతాడా. ఇప్పటికే రూ.330 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు వినికిడి. అన్నీ ఎలా ఉన్నా.. ఇప్పటివరకు రూ.60 కోట్లు వేస్ట్ ఫుటేజీ తీసాడట శంకర్. దిల్ రాజు ‘కామ్ గోయింగ్’ పర్సన్ కాబట్టి సరిపోతుంది. అదే తమిళ నిర్మాతలు అయితే ఈ విషయానికి శంకర్ పై ఇంకో కేసు వేసి ఉండేవారు అనడంలో అతిశయోక్తి లేదు.