ప్రఖ్యాత దర్శకుడు….శంకర్…తమిళ తలైవా…రజనికాంత్ కలసి సంధించిన టెక్నికల్…గ్రాఫికల్ ఆయుధం….’రోబో’. చలన చిత్ర చరిత్రలోనే ఈ సినిమా కానీ…వినీ ఎరుగని రికార్డ్స్ మాత్రమే కాకుండా కలెక్షన్స్ విషయంలో సైతం భారీగా వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సీక్వేల్ చెయ్యాలనే ఆలోచనతో ఉన్న శంకర్ రజనికి తెలుపగా….రజని సైతం ఒకే చెప్పాడు…ఇక ఈ సినిమాపై ఫోకస్ పెట్టిన శంకర్ ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైస్ కానంటున్నాడు…విషయంలోకి వెళితే….ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ ఇండియన్ సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయే అంత వింతగా ఉంటుంది…..అలాంటిది…ఒక సౌత్ ఇండియన్ మూవీకి కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ.100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారంటే షాకవ్వాల్సిందే.
మరి ఆ వివరాలు ఏంటంటే…శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 (2.0) గ్రాఫిక్స్ కోసం లైకా ప్రొడక్షన్స్ అనే సంస్థ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నట్లు సమాచారం. రోబో తొలి భాగానికి గ్రాఫిక్సే ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ తో మన ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు శంకర్. ఆ సినిమాకు సీక్వెల్ అంటే.. వీఎఫ్ఎక్స్.. గ్రాఫిక్స్ విషయంలో మరింత భారీగా ఆశిస్తారు అభిమానులు. ఆ అంచనాల్ని అందుకునేందుకు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు శంకర్. హాలీవుడ్కు చెందిన దాదాపు ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో-2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపుగా 10 నెలల సమయం దీనిపై వెచ్చించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక 2017 చివర్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి ఘన విజయం సాధిస్తుందో చూడాలి .