అప్పుడెప్పుడో వచ్చిన “జయం” తర్వాత తేజ హిట్ కొట్టింది “నేనే రాజు నేనే మంత్రి” చిత్రంతోనే. ఈ గ్యాప్ లో వచ్చిన సినిమాలన్నీ ఎప్పుడు విడుదలయ్యాయి కూడా తెలియకుండా డిజాస్టర్లుగా కొట్టుకుపోయాయి. కానీ.. జయాపజయాలతో సంబంధం లేకుండా తేజ మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాడు. సినిమా టెక్నీకాలిటీస్ విషయంలో ఎల్లప్పుడూ ముందుండే తేజ ఈసారి సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం మొదలెట్టాడు. తాను ప్రస్తుతం రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ త్వరలో మొదలెట్టనున్న ఓటీటీకి కంటెంట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు తేజ.
ఈ షూటింగ్ లో పాల్గొన్నప్పుడే ఆయనకు కరోనా కూడా వచ్చింది. అయితే.. ఈ సిరీస్ ను బోldగా తీస్తున్నాడట తేజ. దర్శకుడిగా ఎలాగూ ఆయన పేరు ఉండదు కాబట్టి, కేవలం నేతృత్వమే కాబట్టి వీరలెవల్లో ఆ సిరీస్ ఉండబోతొందని తెలుస్తోంది. అలాగే.. ఈ సిరీస్ లో ఒన్నాఫ్ ది హీరోయిన్ గా తేజ “హోరా హోరీ” చిత్రంతో ఇంట్రడ్యూస్ చేసిన దక్ష నటిస్తోందట. “హోరా హోరే” అనంతరం “హుషారు” అనే సినిమాలో నటించినప్పటికీ అమ్మడికి సరైన గుర్తింపు లభించలేదు.
దాంతో.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజనే మళ్ళీ తనకు లైఫ్ ఇస్తాడని నమ్ముతొంది. మరి అమ్మడి నమ్మకం ఈమేరకు ఫలిస్తుందో చూడాలి.