తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేది జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నవంబర్ 30వ తేదీ ఎన్నికలు జరగడంతో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలందరూ కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పండు ముసలి వాళ్లు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యువకులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక సినీ సెలబ్రిటీలు మొత్తం పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా అందరూ వచ్చి ఓటు వేయాలంటూ కూడా సందేశం ఇచ్చారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న విషయం గురించి ఈయన మాట్లాడారు. ఈసారి సెలబ్రిటీలందరూ కూడా ఉదయమే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి క్యూ లైన్ లో నిలబడి సాధారణ వ్యక్తులు మాదిరిగానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఓటు వినియోగించుకున్నటువంటి డైరెక్టర్ తేజ (Director Teja) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోని వారందరూ కూడా దేశద్రోహులే అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దేశద్రోహులు జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉన్నారు అంటూ ఈయన ఎవరైతే తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేదు వారిని ఉద్దేశించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎవరైతే ఓటు వేయలేదో అలాంటివారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతారని ఈయన తెలిపారు. ఇలా ఓటర్లను ఉద్దేశించి తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తేజతో పాటు ఇతర సెలబ్రిటీలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.