వెంకటేష్ మహా.. అందరికీ సుపరిచితమే. ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అందరినీ సర్ప్రైజ్ చేశాడు వెంకటేష్ మహా. ఎందుకంటే అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో అలాంటి సినిమా రాలేదు. ఆ సినిమాలో నటించిన చాలా మంది ఇప్పుడు బిజీ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇక తన రెండో ప్రయత్నంగా సత్యదేవ్ తో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమా చేశాడు. కోవిడ్ కారణంగా ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
ఇక్కడ ఈ సినిమాని బాగా చూశారు అనే చెప్పాలి. ఇందులో కొన్ని సన్నివేశాలు అయితే ఇప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఈ సినిమా వల్ల చిన్న కాంట్రోవర్సీ కూడా నెలకొంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇమేజ్ ను తక్కువ చేస్తూ కొన్ని డైలాగులు ఉంటాయి.మరోపక్క ఎన్టీఆర్ ను పొగుడుతున్నట్టు కూడా చూపించారు. దీంతో మహేష్ అభిమానులు దర్శకుడు వెంకటేష్ మహాని దారుణంగా ట్రోల్ చేశారు.
ఈ ఇష్యూ పై ఆ టైంలో (Venkatesh Maha) వెంకటేష్ మహా స్పందించింది లేదు. అయితే ఇటీవల తాను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చేసిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే సినిమా ప్రమోషన్లో ఈ విషయమై స్పందించాడు. ” ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా షూటింగ్ టైంలో మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ బాబు గురించి ఏమనుకుంటారు?, మహేష్ బాబు ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ ని ఎలా తీసుకుంటారు? అనేది టెస్ట్ చేశాము. అరకులో ఉన్న ఆ హీరోల అభిమానులు ఎలా వ్యవహరిస్తారు అనేది టెస్ట్ చేసి సినిమాలో ఆ సీన్లు పెట్టాను.
చివరికి మహేష్ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని ఫ్రెండ్ అయినట్టు చూపించాను. నిజజీవితంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు, మహేష్ అభిమానులు ఫ్రెండ్స్ గా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. మహేష్ బాబు అంటే నాకు ప్రత్యేకంగా కోపం అంటూ ఏమీ లేదు” అంటూ వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు.