దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula).. పరిచయం అవసరం లేని పేరు. ‘ఛలో’ (Chalo) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత చేసిన రెండో సినిమా ‘భీష్మ'(Bheeshma) కూడా విజయం సాధించింది. టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు.. రెండో సినిమాతో విజయం సాధించడం అనేది అరుదుగా జరుగుతుంది అని..! రాజమౌళి (S. S. Rajamouli), బోయపాటి శ్రీను (Boyapati Srinu), త్రివిక్రమ్ (Trivikram), కొరటాల శివ (Koratala Siva), శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala).. వంటి వారికి తప్ప ఈ ఫీట్ సాధ్యపడలేదు.
కానీ వెంకీ కుడుముల ఆ ఫీట్ సాధించాడు. అందుకే అతనిపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ‘భీష్మ’ సినిమా టైంలో వెంకీకి తన మొదటి సినిమా హీరో నాగశౌర్యతో (Naga Shaurya) గ్యాప్ వచ్చింది అనే రూమర్ స్ప్రెడ్ అయ్యింది. దానికి కారణం కూడా ఉంది. నాగశౌర్య తన ‘అశ్వద్ధామ’ (Aswathama) సినిమా ప్రమోషన్స్ టైంలో ‘ ‘ఛలో’ కథ నాదే. నేనే డెవలప్ చేసుకున్నాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెంకీ కుడుములతో నాగ శౌర్యకి మనస్పర్థలు రావడమే దానికి కారణం అని అంతా అనుకున్నారు.
‘భీష్మ’ సక్సెస్ మీట్లో నితిన్ సైతం..’ ఇంతకీ కథ నీదే కదా.. లేక నా పేరు గానీ వేశావా?’ అంటూ సెటైర్ కూడా వేశాడు. ఆ టైంలో ఇది బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఈరోజు వెంకీ కుడుముల మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో ‘నాగశౌర్యతో వివాదం సర్దుమణిగినట్టేనా?’ అని మీడియా వారు అతన్ని ప్రశ్నించడం జరిగింది. అందుకు వెంకీ కుడుముల.. ‘అది ఎప్పుడో సార్టౌట్ అయిపోయింది అండి. నాగశౌర్య నేను ‘జాదూగాడు’ (Jadoogadu) సినిమా టైం నుండి ఫ్రెండ్స్. ఈ మధ్యనే అతన్ని కలిశాను. మేము బాగానే ఉన్నాం’ అన్నట్టు చెప్పుకొచ్చాడు వెంకీ.