హిడెన్ టాలెంట్… ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అందులోనూ సినిమావాళ్లకు సంబంధించినంతవరకు ఇంకా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్. తాజాగా దర్శకుడు మారుతికి సంబంధించి ఓ హిడెన్ టాలెంట్ ఇటీవల వైరల్‌గా మారింది. అయితే అది ఆయన వాట్సాప్ స్టేటస్‌లో ఉండటంతో బయటవాళ్లకు తెలియలేదు. అదే పెయింటింగ్. ఈ మధ్య ఒకరోజు ఆయన చిరంజీవి స్కెచ్‌ను గీశారట. నిమిషాల వ్యవధిలో బొమ్మ గీసేసి వావ్ అనిపించారు. దీంతో ఆ టాలెంట్ గురించి అంతటా చర్చించుకుంటున్నారు. అసలు ఆయనకా టాలెంట్ ఎలా వచ్చిందంటారు!
మారుతి పెయింటింగ్ గురించి మాట్లాడాలి అంటే… ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు అనేది తెలియాలి. మారుతి సినిమాల్లోకి వచ్చేముందు యానిమేషన్ రంగంలో ఉన్నారు. అందుకే ఆయన సినిమా టైటిల్స్‌ను ఆయనే డిజైన్ చేసుకుంటారు. ఆ రోజుల్లో యానిమేషన్ గురించి తెలియాలి అంటే ఆర్ట్ డ్రాయింగ్ వచ్చి ఉండాలి. అలా ఆయనకు డ్రాయింగ్‌లో ప్రవేశం వచ్చింది. దానిని అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటారట. అదన్నమాట మేటర్. మారుతి కుమార్తెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట.
ఈ క్రమంలో ఇటీవల ఓసారి పెయింటింగ్ వేస్తూ కనిపించిందట. దీంతో మారుతికి ఠక్కున తన పాత ప్రతిభ గుర్తొచ్చిందట. పాత కళ నాలో అలాగే ఉందా? లేదా? అని చెక్ చేసుకుందాం అనుకున్నారట. వెంటనే పక్కనున్న పెన్సిల్ తీసుకొని ఏదైనా బొమ్మ గీద్దాం అనుకున్నారట. వెంటనే మనసులో గుర్తుకొచ్చిన రూపం చిరంజీవి. వెంటనే ఆయన బొమ్మను చకచకా గీసేశారట మారుతి.