ప్రభాస్, అల్లు అర్జున్ (Allu Arjun) ఇద్దరూ కూడా ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న పాన్ ఇండియా స్టార్లు. ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్క్లూజన్’ ‘సాహో’ చిత్రాలతో ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే కచ్చితంగా 4 భాషల్లో రూపొందాల్సిందే. ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో నటించి మెప్పించాడు.
త్వరలో రాబోతున్న ‘పుష్ప 2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్ – ప్రభాస్ ఇద్దరూ కూడా నిజజీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చారు కూడా..! గతంలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు ప్రభాస్ ముఖ్య అతిథిగా వెళ్ళాడు. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజుని తన ‘డార్లింగ్’ సినిమా సెట్స్ లో ఘనంగా సెలబ్రేట్ చేశాడు ప్రభాస్.
ఇప్పటికీ వీరి ఫ్రెండ్ షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం గతంలోకి వెళ్తే.. అల్లు అర్జున్, ప్రభాస్ లు నటించిన సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి.అవే ‘గంగోత్రి’ ‘రాఘవేంద్ర’ సినిమాలు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి సినిమా ‘గంగోత్రి’ అలాగే ‘ఈశ్వర్’ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ సినిమాలు ఒకే రోజున అంటే 2003 మార్చ్ 28న రిలీజ్ అయ్యాయి.
ఇందులో అల్లు అర్జున్ నటించిన ‘గంగోత్రి’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అలా బన్నీ సినిమా ముందు ప్రభాస్ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి నేటితో 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది.