చిత్ర పరిశ్రమలో నిర్మాతకు ఉండే కష్ట నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా నిర్మాణం అనేది చాల రిస్కీ జాబ్. కేవలం 2% సక్సెస్ రేట్ ఉన్న చిత్ర పరిశ్రమలో చాల సార్లు పెట్టుబడి కూడా తిరిగిరాదు. అయినప్పటికీ సినిమాపై ఫ్యాషన్ తో చాల మంది ఆస్థులు అమ్ముకొని సైతం సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. సినిమా నిర్మాణం ఒక ఎతైతే దానిని విడుదల చేయడం మరో ఎత్తు. ఇక కొన్ని సార్లు దర్శకులు చెప్పిన సమయానికి మూవీ పూర్తి చేయకుండా పొడిగించుకుంటూ పోతారు.
సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే నిర్మాణ బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు, వడ్డీల రూపంలో నిర్మాతకు అదనపు భారం వచ్చి చేరుతుంది. ఈ విషయంలోనే దర్శకుడు రాజమౌళిపై ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య గుర్రుగా ఉన్నారట. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ చెప్పిన సమయానికి ఆరు నెలలు పొడిగించబడింది. దీనికి ఆర్ ఆర్ ఆర్ హీరోలకు గాయాలు కావడం ఒక కారణం అయితే రాజమౌళి బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కోసం లండన్ వెళ్లడం, కుమారుడు వివాహం కోసం ఓ నెల రోజులు షూటింగ్ కి డుమ్మా కొట్టడం వంటివి చేశారు. ఈసారైనా చెప్పిన ప్రకారం జనవరి 8, 2021 కి వద్దామనుకుంటే కరోనా వెంటాడుతుంది. కాబట్టి మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో టెన్షన్ పడుతున్న నిర్మాత దానయ్య రాజమౌళిపై అసహనంగా ఉన్నాడట.