‘గుడ్ సినీమా గ్రూప్’, ‘మారుతీ మీడియా హౌస్’ బ్యానర్ల పై గుడ్ ఫ్రెండ్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఈరోజుల్లో’. మారుతీ దర్శకత్వం వహించిన మొదటి చిత్రమిది. మంగం శ్రీనివాస్, రేష్మా రాథోర్ లు జంటగా నటించిన ఈ చిత్రం కేవలం రూ.45 లక్షల బడ్జెట్ తో నిర్మితమైంది. ఎటువంటి అంచనాలు లేకుండా 2012 వ సంవత్సరం మార్చి 23న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఘనవిజయాన్ని సాధించింది.
తెలుగు సినిమా మేకింగ్ కు కొత్త దారి చూపించిన చిత్రంగా ‘ఈరోజుల్లో’ నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది.
ఈ నేపథ్యంలో ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
2.95 cr
సీడెడ్
1.35 cr
ఉత్తరాంధ్ర
1.00 cr
ఈస్ట్
0.55 cr
వెస్ట్
0.35 cr
గుంటూరు
0.67 cr
కృష్ణా
0.58 cr
నెల్లూరు
0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
8.46 cr
‘ఈరోజుల్లో’ చిత్రానికి కేవలం రూ.0.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రూ.8.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ ఒక్క ఛితంతోనే దర్శకుడు మారుతీ బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. అప్పట్లో ఓటిటిల హడావిడి లేదు కానీ ఉండుంటే ఈ మూవీ నిర్మాతలకి ఇంకా లాభాలు దక్కుండేవి. శాటిలైట్ రైట్స్ రిలీజ్ తర్వాత అమ్మడంతో అది కూడా మంచి రేటుకే వెళ్ళింది. అటు బయ్యర్లకి ఇటు నిర్మాతలకి ఇద్దరికీ ఈ మూవీ మంచి లాభాలను అందించింది.