యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ‘దేవర’ (Devara) సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. మొదటి భాగం తెలుగులో మంచి విజయాన్ని సాధించినప్పటికీ, నార్త్ ఇండియన్ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ, సినిమా ప్రాఫిట్స్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రెండు భాగాలుగా ప్లాన్ చేయగా, అసలైన కథ మేజర్‌గా రెండో భాగంలో ఉంటుందని సమాచారం. ‘దేవర పార్ట్ 1’కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా, ‘దేవర 2’ స్క్రిప్ట్‌ను మరింత బలంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలుస్తున్నారట.
Devara 2
కొరటాల శివ కథలో కొన్ని మార్పులు చేస్తూ, ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు. బ్లడ్ యాక్షన్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ ట్విస్టులతో రెండో భాగం ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని టాక్. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్ షూటింగ్ 2025 అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతోందట.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది మరికొన్ని రోజుల్లో ఫినిష్ కావచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు ‘దేవర 2’ కూడా ఎన్టీఆర్ షెడ్యూల్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఉండగా, ‘దేవర 2’లో ఆమె పాత్రకు మంచి స్కోప్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంతకుముందు ప్రమోషన్లలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం స్పష్టం చేసింది. జాన్వీ క్యారెక్టర్‌కు అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది, ‘దేవర 2’ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.