మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), స్టార్ దర్శకుడు శంకర్(Shankar)..ల ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)సినిమా భారీ అంచనాల నడుమ ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఓపెనింగ్స్ కొంత వరకు పర్వాలేదు అనిపించినా, సంక్రాంతి సెలవులు కూడా కొంత వరకు క్యాష్ చేసుకున్నా.. ఆ తర్వాత మాత్రం డౌన్ అయిపోయింది.
దీంతో అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వకపోవడం వల్ల డిజాస్టర్స్ లిస్టులో చేరిపోయింది ఈ సినిమా. ‘గేమ్ ఛేంజర్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.50 cr |
సీడెడ్ | 10.55 cr |
ఉత్తరాంధ్ర | 10.60 cr |
ఈస్ట్ | 6.36 cr |
వెస్ట్ | 4.15 cr |
కృష్ణా | 5.38 cr |
గుంటూరు | 6.33 cr |
నెల్లూరు | 3.66 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 66.53 cr |
కర్ణాటక | 4.96 cr |
తమిళనాడు | 3.69 cr |
కేరళ | 0.28 cr |
ఓవర్సీస్ | 14.22 cr |
నార్త్ | 14.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 104.28 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.104.28 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.150.72 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. గ్రాస్ పరంగా రూ.188 కోట్లు కలెక్ట్ చేసింది.