వినాయక చవితి వస్తే చాలు ప్రతి వీధిలోనూ గణేష్ ప్రతిమ ప్రత్యక్షమవుతుంది. చిన్న పెద్ద కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి విజ్ఙాలు తొలిగిపోవాలని కోరుకుంటారు. ఉండ్రాలతో నైవేద్యం సమర్పించుకుంటారు. సినిమాల్లోనూ మన హీరోలు విజయం కోసం ఆ శివ పుత్రుడిని తలుచుకున్నారు. పాటలు పాడి, డ్యాన్సులతో అదరగొట్టారు. అటువంటి పాటలపై ఫోకస్..
కూలీ నంబర్ 1
వినాయకుని మండపాల వద్ద, నిమజ్జనం వేళలలో ఇప్పటికీ తప్పకుండా వినిపించే పాట “దండాలయ్యా.. ఉండ్రాలయ్య దయఉంచవయ్యా దేవా”. వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నంబర్ 1 లోని ఈ పాట గణేష్ భక్తి పాటల్లో మొదటి స్థానంలో నిలిచింది.
గణేష్
గణేష్ జస్ట్.. గణేష్ పేరిట ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా చేశారు. ఇందులో తన ప్రేమ ఫలించడంతో ఆనందంతో “రాజా ఘన రాజా” అంటూ పాట అందుకుంటారు. ఇందులో అపార్ట్ మెంట్ వాసులు వినాయక చవితి ఎలా జరుపుకుంటారో చూపించారు.
జై చిరంజీవ
మెగాస్టార్ చిరంజీవి సన్గ్ అంటే అందులో స్టెప్పులుండాల్సిందే. భక్తి పాట కూడా జోష్ గానే ఉండాలి. అందుకే జై చిరంజీవ సినిమాలో “జై జై గణేశా.. జై కొడతా గణేశా” పాటను మణిశర్మ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. యువతకు ఈ సాంగ్ ని దగ్గరి చేశారు.
పోకిరి
మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ పోకిరిలో వినాయకుని స్వామి గురించి ప్రత్యేకమైన పాట లేదు .. కానీ “జగడమే ” అనే పాటలో “గణపతి బప్పా మోరియా” అంటూ మహేష్ ఉత్సాహంగా ఊగిపోయారు.
డిక్టేటర్
యాక్షన్స్ తో అదరగొట్టే బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో గణనాథుడిని కొలుస్తూ పాట పాడారు. ఇందులోని “గమ్ గమ్ గమ్ గణేశా” అనే సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.
ఇద్దరమ్మాయిలతో
దేవీ శ్రీ ప్రసాద్ పాటలంటే అదో కిక్. అల్లు అర్జున్ కోసం ఆయన ఇచ్చే పాటలు కాళ్ళు కదిలేలా చేస్తాయి. ఇద్దరమ్మాయిలతో సినిమాలో “గణపతి బప్పా మోరియా” పాట గణేష్ మండపంలో ఉత్సాహాన్ని నింపుతుంది.
100 % లవ్
ప్రేమ కథ చిత్రం 100 % లవ్ లో మంచి భక్తి గీతం ఉంది. తనకి మంచి మార్కులు వచ్చేలా చేయమని తమన్నా వినాయకుణ్ణి ప్రార్ధిస్తుంది. “తిరు తిరు గణనాధా.. ధి ధి ధి” అని మొదలయ్యే పాట చాలా బాగుంటుంది.
భలే భలే మగాడివోయ్
ఇప్పటి వరకు గణేష్ ని కొలిచే హీరో గురించే తెలుసుకున్నారు. ఇప్పుడు కోప్పడే హీరో గురించి చెబుతాను. భలే భలే మగాడివోయ్ సినిమాలో తనని ఇరకాటంలో పెట్టేసావని వినాయకుడిని తిడుతూ “హౌ హౌ” అని నాని అడుగుతాడు. ఇది కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.