బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తునే ఉంది. లాస్ట్ టైమ్ ప్రీచింగ్ గురించి చెప్తూ పనివాళ్లపైన కామెంట్ చేసింది. అలాగే, ఇప్పుడు హౌస్ మేట్స్ నెగిటివిటీని బయటకి తీయాలని, వాళ్లని రెచ్చగొడితేనే వాళ్లు ట్రిగ్గర్ అవుతారని చెప్తోంది. ఆదిరెడ్డితో మాట్లాడుతూ గీతు తన గేమ్ స్ట్రాటజీని బయటపెట్టింది. నిజానికి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఇనయని శ్రీహాన్ పిట్ట అని కామెంట్ చేశాడు. అప్పుడు గీతు ఇన్వాల్ అయ్యింది. పిట్ట అని నిన్ను కాదు నన్ను అన్నాడు అంటూ ఇనయాపై రెచ్చిపోయింది. తనని ట్రిగ్గర్ చేస్తూ, రెచ్చగొడుతూ టీజ్ చేసింది. ఇనయ కూడా గీతుకి సరైన సమాధానం చెప్పింది.
ఆ తర్వాత బిగ్ బాస్ కెమెరా దగ్గరకి వచ్చి నామినేషన్స్ లో నన్ను మాట్లాడనివ్వలేదు. అందుకే ఇలా రెచ్చగొట్టాను అని, ఇప్పుడు హ్యాపీగా ఉందని చెప్పింది గీతు. అంతేకాదు, బిగ్ బాస్ లో గేమ్ ఇలాగే ఆడాలంటూ కామెంట్స్ చేస్తోంది. ఆదిరెడ్డి నువ్వు చేసిన పని నచ్చలేదు, నేను ఇంట్లో ఉన్నా, బయట రివ్యూ చెప్పినా కూడా ఇదే చెప్పేవాడ్ని అంటూ గీతుకి సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ, గీతు బిగ్ బాస్ గేమ్ అంటేనే ఎదుటివారిని రెచ్చగొట్టడం అని, వాళ్లలో నెగిటివిటీ ని బయటకి లాగడమే అని కామెంట్స్ చేస్తూ నోరు జారింది.
కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోయిన గీతు ఆ తర్వాత కెప్టెన్ అయిన ఆదిరెడ్డికి సపోర్ట్ చేసింది. అందుకే, ఆదిరెడ్డి గీతు గేమ్ కి సలహా ఇచ్చేందుకు వచ్చాడు. కెప్టెన్ గా హౌస్ కూల్ గా ఉంచేందుకు చూశాడు. కానీ, ఇనయపై కక్ష్య పెంచుకున్న గీతు ఇనయకి లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. కావాలని ట్రిగ్గర్ చేస్తూ రెచ్చగొట్టింది. తను చేసిన పనిని గీతు సమర్ధించుకుంటూ బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో చెప్పింది. అంతేకాదు, అర్జున్ జైల్ కి వెళ్లకూడదని, ఆరోహి, కీర్తి ఇద్దరూ ఉన్నారు కదా వాళ్లతో ఆర్గ్యూమెంట్ చేయాలని అదే బిగ్ బాస్ గేమ్ అంటే అంటూ రివ్యూస్ చెప్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో ఎవరి గేమ్ ఎలా ఆడుతున్నారో కూడా గీతు ఎనలైజ్ చేసేస్తోంది. ఆరోహి విషయంలో కూడా ఆరోహి డబుల్ మైండ్ మాట్లాడుతోందని, మాటలని ట్విస్ట్ చేసి చెప్తోందని, దానివల్ల నాకు మూడు సార్లు ఇబ్బంది కలిగిందని ఫైమాతో చెప్పింది. ప్రస్తుతానికి నామినేషన్స్ లో ఉన్న గీతురాయల్ సేఫ్ జోన్ లోనే ఉంది. మరి రానున్న వారాల్లో గీతు ఏ హౌస్ మేట్ తో గొడవ పెట్టుకుంటుందో , ఏ హౌస్ మేట్ ని రెచ్చగొడుతుందో అనేది చూడాలి. అదీ మేటర్.