నాని (Nani)ని హీరోగా లాంచ్ చేసింది దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్లో దాదాపు 6 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా ‘జెంటిల్ మన్’ (Gentleman). దీంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నివేదా థామస్ (Nivetha Thomas), సురభి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2016 వ సంవత్సరం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. ఒకసారి టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘జెంటిల్ మన్’ చిత్రం రూ.14.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.17.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.2.92 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.