హిట్లు, ఫ్లాప్‌లు… బ్లాక్‌బస్టర్, ఘోరమైన డిజాస్టర్లు చిరంజీవి కెరీర్‌లో కొత్తేమీ కాదు. 44 ఏళ్ల కెరీర్, 150కిపైగా సినిమాల లైఫ్‌లో ఎన్నో చూసి ఉంటారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఇలాంటివి అనేకం గమనించి ఉంటారు. కానీ ‘ఆచార్య’ దగ్గరకు వచ్చేసరికి బాధ చాలా ఎక్కువగా ఉంది. తండ్రీకొడుకుల కలసి మంచి హిట్ సినిమాలో ఉండాలి అని అనుకుంటారు. కానీ ఫలితం మాత్రం చాలా నిరాశపరిచింది. ఫ్యాన్స్ కూడా సినిమాకు వెళ్లేలా ఒక్క సీన్ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా ‘గాడ్ ఫాదర్’పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారట.
చిరంజీవి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. త్వరలో భారత్‌లో ల్యాండ్ అవుతారట. వచ్చీ రాగానే ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’ పనులు డబుల్ ఎనర్జీతో మొదలుపెడతారట. ఈ సారి కొడితే కుంబస్థలమే కొట్టాలని మెగా కాంపౌండ్ మాట. అందుకే ఇప్పటి నుండే సినిమాకు సంబంధించి పనులకు మీద ఫోకస్ పెడుతున్నారట. సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి ఇప్పటివరకు డేట్ చెప్పకపోయినా.. ఆగస్టు 11 అనేది అన్ అఫీషియల్ మాట. ఆ రోజు సినిమా పక్కా అంటున్నారు.
అంతే కాదు ఈ సినిమా ప్రచారం విషయంలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్‌ను చూపిస్తారట. దాని కోసం పక్కా ప్లానింగ్‌తో వెళ్తారని టాక్. ఈ సినిమా నేపథ్యంలో అనంతపురం అని చూపించబోతున్నారట. అందుకే అనంతపురంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టాలని చిరంజీవి అనుకున్నారట. అయితే గతంలో అనుకున్న ఈ మాటను అదే స్థాయిలో చేయాలని చూస్తున్నారట. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రచారం, ఇంటర్వ్యూలు విషయంలో ఫుల్ జోష్ చూపిస్తారట.
నిజానికి ఆగస్టు రెండో వారంలో ఆమిర్ ఖాన్ – నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’, విక్రమ్ ‘కోబ్రా’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, సమంత ‘యశోద’, అఖిల్ ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిరు మాత్రం లాంగ్ వీకెండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే ‘గాడ్‌ఫాదర్’ తెద్దామని చూస్తున్నారట. అన్నట్టు ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్ అయితే అంతకన్నా ఆనందం అభిమానులకు ఏముంటుంది.