తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly). ఇటీవల అంటే ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.
అజిత్ ఫ్యాన్స్ ను అలరించే అంశాలు ఇందులో ఉండటంతో.. వాళ్ళు థియేటర్లలో సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తుంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.88 cr |
సీడెడ్ | 0.48 cr |
ఆంధ్ర | 0.71 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.07 cr |
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.2.07 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.60 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగులో ఇంకాస్త ప్రమోషన్ చేసి ఉంటే.. ఓపెనింగ్స్ ఇంకాస్త బెటర్ గా వచ్చి ఉండేవి.