టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే డబ్బింగ్ సినిమాల ద్వారా ఇతర భాషల ప్రేక్షకులకు సైతం ఊహించని స్థాయిలో దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే. మహేష్ పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికే మహేష్ బాబుకు ఆ గుర్తింపు దక్కి ఉండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల విషయంలో, ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న సినిమాల విషయంలో గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
గుంటూరు కారంకు పోటీగా చాలా సినిమాలు విడుదలవుతున్నా టాక్ ఆధారంగానే ఆ సినిమాల రిజల్ట్ డిసైడ్ కానుంది. గుంటూరు కారం సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఖాతాలో 300 కోట్ల రూపాయల కలెక్షన్లు ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే గుంటూరు కారం సినిమాకు పోటీగా ఎన్ని సినిమాలు విడుదలైనా ఈ సినిమాకు పోటీ లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గుంటూరు కారం (Guntur Kaaram) నిర్మాత నాగవంశీ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ సినిమా నుంచి అన్ని పాటలు విడుదలయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సైతం ఈ సినిమాపై పూర్తిస్థాయిలో నమ్మకంతో ఉన్నారు.
మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ కనీసం మూడేళ్ల పాటు జరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో గుంటూరు కారం సక్సెస్ సాధించాలి ఉంది. 2024 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు 2024 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి శుభారంభాన్ని ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 సంవత్సరం టాలీవుడ్ కు మరింత కలిసి రావాలని అభిమానులు ఫీలవుతున్నారు.