ఇటీవల విడుదలైన నాని ‘దసరా’ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. మొదటి రోజు ఎవ్వరూ ఊహించని విధంగా రూ.20 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డుని క్రియేట్ చేసింది. మిడ్ రేంజ్ హీరోల్లో ఈ ఫీట్ ను సాధించిన మొదటి హీరోగా నాని ఆల్ టైం రికార్డు సృష్టించాడు. ఇదే ఊపులో సినిమా రూ.80 కోట్ల షేర్ ను రాబడుతుంది అని అంతా అంచనా వేశారు.
ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలు (Nani) నటించిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘గీత గోవిందం’ నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ‘దసరా’ .. ‘గీత గోవిందం’ కలెక్షన్లను బ్రేక్ చేయడం ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఫైనల్ గా ‘దసరా’ రూ.65 కోట్ల షేర్ మార్క్ ను మించి కలెక్ట్ చేసే అవకాశం లేదని ట్రేడ్ పండితులు తేల్చేసారు.
దీంతో ఇప్పుడు ‘గీత గోవిందం’ రికార్డుని ఎవరు బ్రేక్ చేస్తారు? అనే ప్రశ్న మిగిలిపోయినట్టైంది. ఆ అవకాశం ఇంకో ఇద్దరు మిడ్ రేంజ్ హీరోలకు ఉంది. అందులో ఒకరు అఖిల్ కాగా మరొకరు రామ్. అఖిల్ .. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే సినిమా చేశాడు. ఏప్రిల్ 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా కాబట్టి.. ట్రైలర్ కనుక అంచనాలను మ్యాచ్ చేయగలిగితే..
తప్పకుండా ఈ సినిమా సమ్మర్ అడ్వాంటేజ్ తో భారీ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. అఖిల్ వల్లకాకపోతే రామ్ కి కూడా ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. బోయపాటి సినిమాలకి మాస్ లో భారీ క్రేజ్ ఏర్పడుతుంటుంది. సో ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా దసరా సీజన్ లో రికార్డు కలెక్షన్స్ సాధించి ‘గీత గోవిందం’ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఉంది.