లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్ళైన సినీ సెలబ్రిటీలలో నిఖిల్ ముందు వరుసలో ఉంటాడు. ప్రముఖ వైద్యురాలు పల్లవి వర్మతో నిఖిల్ పెళ్లి ఈ మధ్యనే జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ‘అర్జున్ సురవరం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ2′ ’18 పేజెస్’ అనే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక చాలా రోజుల తరువాత నిఖిల్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ లైవ్ చాట్ లో నిఖిల్ కు నెపోటిజంకు సంబందించిన ప్రశ్నలు అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
సుశాంత్ ఈమధ్యనే డిప్రెషన్ కు లోనయ్యి అగాయిత్యం చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దాంతో అతను ఈ అఘాయిత్యం చేసుకోవడానికి కారణం బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమే అని భావించి.. బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ను, నిర్మాతలను.. అందరూ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇక టాలీవుడ్లో కూడా నేపోటిజం ఉందా అని నిఖిల్ ను ప్రశ్నించగా.. “నిజం చెబుతున్నా.. టాలీవుడ్‌లో మాత్రం అలాంటిది లేదు. టాలీవుడ్ నన్ను బాగా రిసీవ్ చేసుకుంది.ఇక్కడ నన్ను బాగా ఎంకరేజ్ చేసారు. టాలీవుడ్ ఫ్యామిలీలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఇక సుశాంత్ సింగ్ విషయంలో జరిగిన దానికి నేను చాలా బాధ పడుతున్నాను.
నెపోటిజం అనేది ప్రతి చోటా ఉంటుంది.ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుంది. తొక్కేయ్యలని చాలా మంది చూస్తుంటారు. అయితే మన ట్యాలెంట్ అండ్ హార్డ్ వర్క్ తో దానిని తట్టుకుని నిలబడాలి.ఒక్క ఆత్మ*త్య మాత్రం పరిష్కారం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక్కడ ‘టాలీవుడ్లో నేపోటిజం అనేది లేదు అంటూనే నేపోటిజం అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది.. తొక్కెయ్యాలని చూస్తుంటారు అని’ నిఖిల్ కామెంట్స్ కాస్త కన్ఫ్యూజ్ చేసాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.