వరుసగా కమర్షియల్ సినిమా చేస్తూ ఇబ్బందికర ఫలితాలు అందుకున్న రామ్ (Ram).. మరోసారి ‘నేను శైలజ’ రోజుల్ని గుర్తు చేసుకున్నట్లు ఉన్నారు. అందుకే మరోసారి ప్రేమకథవైపు వెళ్తున్నారు. మహేష్‌బాబు.పి (Mahesh Babu P) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నారట. ఇప్పుడు ఆయన గురించే టీమ్ సెర్చింగ్ మొదలుపెట్టిందట. రామ్ పోతినేని – భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Borse) జంటగా మహేశ్‌బాబు.పి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
Ram
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మరో షెడ్యూల్ కోసం త్వరలోనే రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు నెల రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట. అక్కడ షూటింగ్‌లో కొత్త నటుడు టీమ్‌తో జాయిన్ అవుతారు అని అంటున్నారు. ఆ నటుడు సీనియర్ హీరో అవ్వొచ్చు అని టాక్. సినిమాలో కీలక పాత్రలో ఆ సీనియర్ స్టార్ హీరో నటిస్తారని చెబుతున్నారు.
దీని కోసం తెలుగు, తమిళ, మలయాళ కథానాయకుల పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి తెలుగు హీరో గురించే చూసే అవకాశం ఉంది. ఒకవేళ మల్టీ లాంగ్వేజ్ ఆలోచన వస్తే అప్పుడు సౌత్ హీరోల గురించి చూస్తారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే..
సాగర్ అయనే యువకుడు, అతని ప్రేమ ప్రయాణమే ఈ సినిమా అని చెబుతున్నారు. కథ వినడానికి సింపుల్‌గా ఉన్నా.. కథనం చాలా కాంప్లికేటెడ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది అని చెబుతున్నారు. మహేష్‌బాబు.పి గతంలో అంటే 2014లో తొలి సినిమా చేశారు. సందీప్ కిషన్‌తో (Sundeep Kishan) ‘రా రా కృష్ణయ్య’ (Ra Ra Krishnayya) చేశారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 2023లో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) – అనుష్కతో (Anushka Shetty) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చేశారు.