గోపీచంద్ (Gopichand) హీరోగా ‘ఘాజి’ (Ghazi) ‘అంతరిక్షం’ (Antariksham 9000 KMPH) ఫేమ్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ (Ritika Nayak) ఎంపికైనట్టు సమాచారం. ఆల్రెడీ గోపీచంద్ –రితిక..ల మధ్య ఒక ఫోటో షూట్ కూడా చేశారట. సో త్వరలోనే ఈ విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. గోపీచంద్ సరసన ఇమేజ్ లేని హీరోయిన్లు కనుక నటిస్తే.. వాళ్ళకి మంచి క్రేజ్ వస్తుంది అనేది ఆ సెంటిమెంట్. అలా చూసుకుంటే రితిక మంచి ఛాన్స్ కొట్టినట్టే అని చెప్పాలి. ఎందుకంటే.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాలో రితిక తన లుక్స్, నటనతో ఆకట్టుకుంది. కానీ తర్వాత ఆమెకు పెద్ద ఎత్తున ఛాన్సులు అయితే రాలేదు. ‘మిరాయ్’ (Mirai) ‘కొరియన్ కనకరాజు’లో హీరోయిన్ గా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
కానీ ఆ ప్రాజెక్టుల విషయంలో రితిక హైలెట్ అవ్వడం లేదు. అయితే గోపి సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకుడు కావడంతో.. రితికకి ఇంకో ప్లస్. ఎందుకంటే సంకల్ప్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. పైగా ఇది చారిత్రాత్మక కథ అని అంటున్నారు. రితిక ఓ ప్రిన్సెస్ మాదిరి కనిపిస్తుంది అనే టాక్ కూడా నడుస్తోంది. చూడాలి మరి.