స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో హీరోగా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ 2023లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే వెంకటేష్ కొడుకు అర్జున్ సినీ ఎంట్రీ గురించి మాత్రం స్పష్టత రావడం లేదు. హీరో వెంకటేష్ మాత్రం వేగంగా సినిమాల్లో నటిస్తున్నారు. వెంకటేష్ నటించి ఈ నెల 20వ తేదీన విడుదలైన నారప్ప సక్సెస్ సాధించింది.వెంకటేష్ నటించిన దృశ్యం2 సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ నటిస్తున్న ఎఫ్3 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం. వెంకటేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అర్జున్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతి హీరోను తన సినిమాలో అద్భుతంగా చూపిస్తారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో చిన్న పాత్రలో నటించినా తమకు మంచి గుర్తింపు వస్తుందని చాలామంది నటీనటులు భావిస్తారు. అయితే ఈ దర్శకుడి సినిమాలో నటించిన హీరోల తరువాత సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలామంది దర్శకులు రాజమౌళి డైరెక్షన్ లో నటించి హిట్ కొట్టిన హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఫెయిల్యూర్ ను చవిచూశారు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్, తారక్ లతో హిట్ సాధించాల్సిన బాధ్యత కొరటాల శివపై పడింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఆ తరువాత హీరోగా మారాడు. ‘గుంటూరు టాకీస్’ సినిమా నటుడిగా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత చాలా సినిమాలే చేశాడు. కానీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. లాక్ డౌన్ లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాతో సిద్ధుకి ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసింది. మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ స్టార్ అనిపించుకున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే శర్వానంద్ భవిష్యత్తు సినిమా కూడా టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకక్కనుందని వార్తలు వస్తుండటం గమనార్హం. సాధారణంగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ కథలతో పోలిస్తే శర్వానంద్ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం. శర్వానంద్, అతని ఫ్రెండ్స్ బాల్యంలోకి వెళతారని స్టూడెంట్ డేస్ ఎలా గడిచాయో గమనిస్తారని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
కోలీవుడ్ దర్శకుడు శంకర్ అనగానే అందరికి బడ్జెట్ లెక్కలే ఆలోచనలోకి వస్తాయి. ప్రస్తుతం ఆయన బ్యాడ్ టైమ్ నడుస్తోంది గాని ఒకప్పుడు మాత్రం శంకర్ పెట్టిన బడ్జెట్ కు డబుల్ ప్రాఫిట్స్ ను అందించేవారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ పై కనబడేది. అంత రిచ్ గా ఆలోచిస్తాడు కాబట్టి ఆయనతో వర్క్ చేసే నిర్మాతలు కూడా చాలా రిచ్ గా ఉండాలి. అయితే ఇంతవరకు 100కోట్ల బడ్జెట్ ను టచ్ చేయని దిల్ రాజు మొదటిసారి శంకర్ తో వర్క్ చేస్తుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!