పవన కల్యాణ్ ఫ్యాన్స్ రీసెంట్ ట్వీట్స్, లేదంటే కామెంట్స్ చూడండి… అందులో మీకు కామన్‌గా కనిపించే పాయింట్ ‘హైప్’. అవును హైపే. తమ అభిమాన నాయకుడు సినిమా గురించి తెగ రాస్తూ హైప్ పెంచేస్తున్నారు. నిజానికి అవేవో వాళ్లు సరదాకి రాసుకున్నవి కావు. ఓ సినిమా టీమ్ చెబుతున్న మాటలే అవి. ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలుసు కదా… ‘ఓజీ’. వర్కింగ్ టైటిల్‌గా ‘ఓజీ’ అని పెట్టి సుజీత్ ఓ సినిమా చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఏ అభిమానిని అడిగినా ‘హైప్‌తో పిచ్చెక్కిపోతున్నాం’ అనే మాటే అంఉటన్నారు.
పవన్ కల్యాణ్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సుజీత్. దీని కోసం ఎక్కడెక్కిడి నుండో సాంకేతిక నిపుణులను, నటులను తీసుకొస్తున్నారు. కోలీవుడ్ నుండి కీలకమైన ఆర్టిస్ట్‌లను, నార్త్ నుండి విలన్‌ను తీసుకొచ్చారు. ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి అంటున్నారు. ఇలా సెట్‌కి ఎవరొచ్చినా వాళ్ల సోషల్ మీడియా అకౌంట్‌లో సినిమాను పొగిడేస్తున్నారు. సినిమాను అంతకుమించి అనే రేంజిలో సుజీత్ రూపొందిస్తున్నారు. పవన్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే అదరహో అని చెబుతున్నారు.
ఈ మాటలన్నీ చూసి.. ‘ఓజీ’ అంటే హైప్.. హైప్ అంటే ఓజీ అనే పరిస్థితి వచ్చింది. చాలా వరకు ఇలాంటి పెద్ద సినిమాల విషయంలో హైప్ రాకుండా చూసుకుంటారు. మళ్లీ అంచనాలు పెరిగిపోయి.. అంత మొత్తంలో సత్తా లేకపోతే బాక్సాఫీసు దగ్గర ఇబ్బంది అని. కానీ ‘ఓజీ’ విషయంలో మాత్రం టీమ్ ఆలోచన వేరేలా ఉంది. ఎంత హైప్ పెరిగితే అంత మంచిది అనుకునేలా ఉన్నారు. సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ ఈ హైప్‌ను ఇంకా పెంచాయి.
‘ఓజీ’ (OG Movie) బడ్జెట్ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటుందని కమల్ అనే నటుడు చెబుతున్నారు. సినిమా నేపథ్యం, సెటప్ చూస్తుంటే ఇలానే ఉంది. వాయిస్‌తో ఇటీవల స్టార్ అయిపోయిన తమిళ నటుడు అర్జున్ దాస్ అయితే దర్శకుడు సుజీత్ తనకు కొన్ని విజువల్స్ చూపించారని, చూస్తే మతి పోయిందని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, స్వాగ్ అదిరిపోయాయి అని చెప్పారు. శ్రియా రెడ్డి కూడా ఇంచుమించు ఇలానే చెప్పారు. మరోవైపు ‘ఓజీ’ కొత్త షెడ్యూల్ జులై 9న ప్రారంభం అవుతుందట.