రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ఈ సంక్రాంతికి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అయితే బాగానే ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ తీవ్రత పెరుగుతూ ఉండడంతో చాలా వరకు పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఉన్నారు. హిందీ మార్కెట్ కు అత్యంత ముఖ్యమైన ఢిల్లీ మహారాష్ట్ర ఒడిసా వంటి ప్రాంతాల్లో కూడా థియేటర్స్ చాలావరకు మూతపడ్డాయి.
మరో ఇరవై రోజుల వరకు నార్త్ థియేటర్లలో సినిమాలను కొనసాగించడం అంటే చాలా కష్టంగానే కనిపిస్తోంది. తమిళనాడు కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా 50% ఆక్యుపెన్సీ తో కొనసాగిస్తున్నారు. ఈ దశలో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను విడుదల చేస్తారా లేదా అనే విషయంలో అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఒక ఓటీటీ సంస్థ ఈ సినిమాకు భారీ ఆఫర్ ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
300 కోట్ల వరకు డీల్ సెట్ చేసుకోవడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే చిత్ర నిర్మాతలు హీరో ప్రభాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా 350 కోట్ల వరకు డీల్ సెట్ అయితే ఒప్పుకునే అవకాశం లేకపోలేదు అని అనేక కథనాలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా 250 కోట్లను అందుకోవడం అంటేనే చాలా కష్టం.
ఇక అలాంటిది మూడు వందల కోట్ల షేర్ వసూలు సాధించాలంటే సాధారణమైన విషయం కాదు. చిత్ర యూనిట్ సభ్యులకు ప్రస్తుతం రెండే రెండు దారులు ఉన్నాయి. సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదా RRR తరహాలోనే వాయిదా వేయాలి. ఈ రెండు కాదు అని సినిమాను విడుదల చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.