2024లో హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ మలయాళం. దాదాపు 40% సక్సెస్ రేట్ సాధించిన మలయాళ చిత్రసీమ.. 2025లో కూడా బోణీ కొట్టింది. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ఐడెంటిటీ” (Identity) మలయాళ వెర్షన్ ఇండియా మొత్తం రిలీజై.. మంచి టాక్ సంపాదించుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
Identity Review
కథ: హరన్ శంకర్ (టోవినో థామస్) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, తండ్రి అతి డిసిప్లేన్ కారణంగా చాలా పెక్యులియర్ గా పెరుగుతాడు. తనకున్న స్ట్రిక్ట్ పర్సనాలిటీ వల్ల ఎన్.ఎస్.జి కమాండో ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత స్కై మార్షల్ అవుతాడు. అయితే.. బెంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేస్ విషయంలో కేరళ వస్తాడు అలెన్ జాకోబ్ (వినయ్ రాయ్). ఆ కేసులో కీలకమైన సాక్షిగా ఉన్న అలీషా (త్రిష)కు జరిగిన యాక్సిడెంట్ కారణంగా ముఖాలు గుర్తుపట్టడంలో ఇబ్బందిపడుతుంటుంది.
ఈ కేసులో అలీషాకు హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు హరన్. ఆ క్రమంలో కొన్ని ఊహించని విషయాలు బయటపడతాయి. అసలు అలెన్ జాకోబ్ ఎవరు? హరన్ తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో అలీషా పోషించిన పాత్ర ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలకు సమాధానమే “ఐడెంటిటీ” (Identity) చిత్రం.
నటీనటుల పనితీరు: టోవినో థామస్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఓసీడీ ఉన్న పాత్రలా అనిపించినప్పటికీ.. చిన్నపాటి వ్యత్యాసాన్ని చూపించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు టోవినో థామస్. యాక్షన్ బ్లాక్స్ లో టోవినో మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను అమితంగా అలరిస్తాయి. వినయ్ వర్మ మరోసారి ఆశ్చర్యపరిచాడు. అతడు విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత “డాక్టర్” అనంతరం అతనికి పడిన మంచి క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఆర్క్ లో క్లారిటీ లోపించింది కానీ.. నటుడిగా మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ తో పాత్రను రక్తి కట్టించాడు.
సినిమాలో త్రిషకు ఉన్న స్క్రీన్ టైమ్ తక్కువే. ఫస్టాఫ్ లో క్యారెక్టర్ గ్రాఫ్ బాగుంది అనుకునేలోపు సెకండాఫ్ కేవలం రెండు సీన్లకు పరిమితం చేసేశారు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం. ప్రతి సీన్ ని అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు. సౌండ్ డిజైన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ వర్క్ టాప్ లెవల్లో ఉంది. యాక్షన్ బ్లాక్స్ ని చాలా క్రిస్ప్ షాట్స్ తో షార్ప్ గా పిక్చరైజ్ చేసారు. అలాగే.. ఫ్యాక్టరీ బ్లాస్ట్ సీక్వెన్స్ లో మంటల రిఫ్లెక్షన్ ఎదురుగా ఉన్న చిన్న వాటర్ పాండ్ లో పడడం భలే ఉంది. అయితే.. క్లైమాక్స్ లో వచ్చే ఫ్లైట్ లో ఫైట్ సీన్ మాత్రం టెక్నికల్ గా తేలిపోయింది. ఆ సీక్వెన్స్ గ్రాఫిక్స్ & టెక్నికాలిటీస్ విషయంలో చాలా కాంప్రమైజ్ అయ్యారు.
దర్శక ద్వయం అఖిల్ పౌల్ – అనాస్ ఖాన్ లు ఒక చిన్న పాయింట్ తో కథను అల్లుకున్న విధానం బాగుంది కానీ.. హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం అనవసరంగా యాడ్ చేసిన కమాండో & స్కై మార్షన్ ఎపిసోడ్ మాత్రం అప్పటివరకు క్రియేట్ అయిన ఇంపాక్ట్ ను కిల్ చేసింది. అలాగే.. త్రిష పాత్రతో ఇంకాస్త డ్రామా క్రియేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమెను, ఆమెతోపాటు కథను పక్కనపెట్టి.. హీరోయిజం & ఎలివేషన్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అనవసరంగా కథను కొంతమేరకు కిల్ చేసిందని చెప్పాలి. దర్శకులుగా వీరిద్దరూ అలరించారు కానీ.. రచయితగా ఆకట్టుకోలేకపోయారు.
విశ్లేషణ: మంచి కథను అనవసరమైన ఎలివేషన్స్ కోసం పాడు చేసారు దర్శకరచయితలు అఖిల్ & అనాస్. అవి లేకుండా తీసి ఉంటే కమర్షియాలిటీ మిస్ అయ్యేది కానీ.. కంటెంట్ పరంగా ఎలివేట్ అయ్యేది. అలా కాకుండా అనవసరమైన క్లైమాక్స్ ఫైట్ తో సినిమాని సాగదీశారు. ఆ కారణంగా క్రెడిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ వేస్ట్ అయిపోయింది. ఫస్టాఫ్ అయ్యేసరికి ఇదేంటి మొన్నే కదా తెలుగులో “ప్రసన్న వదనం” చూసాం అనిపించడం కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమాకి డిస్కనెక్ట్ చేస్తుంది. కానీ.. ఓవరాల్ గా స్టైలిష్ టేకింగ్ మాత్రం తప్పకుండా అలరిస్తుంది.