సినిమా ఇండస్ట్రీలో తొలి సినిమాకే స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం అరుదుగా వస్తుంది. 2002 సంవత్సరం నుంచి కొరటాల శివ (Koratala Siva) ఇండస్ట్రీలో ఉండగా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన కథ, మాటలు అందించారు. కొరటాల శివ డైరెక్టర్ కావాలని భావించిన సమయంలో యూవీ క్రియేషన్స్ వంశీ ద్వారా ప్రభాస్ కు (Prabhas) కథ వినిపించే అవకాశం కొరటాల శివకు దక్కింది. అయితే ప్రభాస్ మాత్రం కథ నచ్చినా బాహుబలి1 (Baahubali) షూటింగ్ త్వరలో మొదలుకానుండటంతో ఆ సినిమాకు మొదట నో చెప్పారు.
అయితే అదే సమయంలో రాజమౌళికి (Rajamouli) ప్రభాస్ కొరటాల చెప్పిన కథ గురించి చెప్పగా కథ బాగుందని బాహుబలి1 మరో ఆరు నెలలు ఆలస్యమవుతుందని జక్కన్న చెప్పడం జరిగింది. ఆరు నెలల్లో మిర్చి సినిమాను పూర్తి చేసి బాహుబలి1 షూటింగ్ లో పాల్గొనమని రాజమౌళి ప్రభాస్ కు సూచించడంతో మిర్చి (Mirchi) సినిమా పట్టాలెక్కింది. అలా కొరటాల శివ ఫస్ట్ మూవీ ఆఫర్ కు జక్కన్న పరోక్షంగా హెల్ప్ చేశారు. ఒకవేళ మిర్చి సినిమా తెరకెక్కకుండా ఉండి ఉంటే కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టేది.
మిర్చి సినిమాలో ప్రభాస్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రస్థానం కూడా ఈ సినిమాతోనే మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ కూడా ఒకటి. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కొరటాల శివ మాత్రం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర1 (Devara) సినిమా తర్వాత కొరటాల శివ దేవర2 తెరకెక్కిస్తారా లేక మరో ప్రాజెక్ట్ తో బిజీ అవుతారా అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. కొరటాల శివ వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తన సినిమాల స్క్రిప్ట్స్ విషయంలో కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.