టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యాడు.అది బాగానే ఆడింది. ఆ తర్వాత ‘యువరాజు’ చేశాడు. అది జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ఇక మూడో చిత్రంగా ఒక ప్రాజెక్టు అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో దాని బదులు ‘వంశీ’ అనే సినిమా చేయాల్సి వచ్చింది మహేష్. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన మూవీ ఇది. ఆ టైంకి ఆయన సూపర్ ఫామ్లో ఉన్నాడు. కేవలం 65 రోజులు వర్కింగ్ డేస్లోనే ‘వంశీ’ చిత్రాన్ని తెరకెక్కించారు.
Vamsi Movie
సినిమాలో మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు అయితే అద్భుతంగా ఉంటాయి. విజువల్ గా కూడా అవి అలరిస్తాయి. ఫైట్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఇన్ని స్పెషాలిటీలు ఉన్నప్పటికీ.. కథ, కథనాలు వీక్ గా ఉంటే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.పైగా ఈ సినిమాలో మహేష్ బాబు కంటే కృష్ణ రోల్ కే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మహేష్ సెకండ్ హీరోలా కనిపిస్తాడు. అది అభిమానులకి సైతం రుచించలేదు.అందుకే ‘వంశీ’ చిత్రాన్ని తిప్పికొట్టారు అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ‘వంశీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్. ఇది మహేష్ బాబు కూడా అంగీకరిస్తాడు. అసలు తనకి ఇష్టం లేకుండా చేసిన సినిమా అంటే ఇది అని అతను ఒకటి రెండు సార్లు చెప్పుకొచ్చాడు. అయితే ‘వంశీ’ విషయంలో ఒక విధంగా అతను సంతృప్తిగానే ఉంటాడట. ఎందుకంటే ‘వంశీ’ సినిమాలో హీరోయిన్ గా నమ్రత నటించింది.
ఈ సినిమా వల్లే వాళ్ళకి పరిచయం ఏర్పడటం.. తర్వాత అది ప్రేమగా మారడం, తర్వాత వీరు పెళ్లిపీటలెక్కడం జరిగింది. 2000వ సంవత్సరం అక్టోబర్ 4న ‘వంశీ’ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 24 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇది డిజాస్టర్ సినిమా అయినప్పటికీ.. మహేష్ బాబు కి చాలా స్పెషల్ సినిమా అనమాట.