మణిరత్నం (Mani Ratnam) తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్నారు అనే వార్త కొద్దిరోజుల నుండి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఫైనల్ గా అందులో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా ఎంపికైనట్టు 2 రోజుల నుండి ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కాంబోని ఎవ్వరూ ఊహించలేదు. నవీన్ పోలిశెట్టి.. తన మార్క్ లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్టైనర్లు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి హీరో మణిరత్నం వంటి లెజెండరీ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటే అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడం సహజం.
Mani Ratnam
ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఫైనల్ అయినట్టు కూడా టాక్ నడిచింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అయితే దీనికి నిర్మాత ఎవరు? అనేది రివీల్ కాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి దిల్ రాజు (Dil Raju) ఓ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తుంది. ఓ తమిళ నిర్మాతతో కలిసి మణిరత్నం తన ‘మద్రాస్ టాకీస్’ పై ఈ సినిమాని నిర్మిస్తారట.
36 ఏళ్ళ తర్వాత మణిరత్నం తెలుగులో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఇదొక న్యూ- ఏజ్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మణిరత్నం మార్క్ ఎమోషన్స్ కూడా ఉంటాయట. నవీన్ పోలిశెట్టి రోల్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందట. నవీన్ కి హిందీలో డీసెంట్ మార్కెట్ ఉంది. అక్కడి ఆడియన్స్ ఇతన్ని బాగానే ఓన్ చేసుకొన్నారు. ఇప్పుడు తమిళ ప్రేక్షకులకి కూడా దగ్గరవ్వాలనేది అతని ప్రయత్నంగా తెలుస్తుంది.
Mani Ratnam after 36 years he’s doing a Straight TELUGU FILM with NaveenPolishetty After Geethanjali Film.