పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయ బాధ్యతలతో పాటు ఇప్పటికే సినిమా లైనప్ కూడా భారంగా ఉంది. చాలా కాలంగా షూటింగ్ లో ఉన్న హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమా ఇంకా పూర్తికాకపోవడమే కాక, మే 9 రిలీజ్ డేట్ చెప్పినా.. ఇప్పటికీ షూటింగ్ మిగిలే ఉంది. ఇదే సమయంలో మరొక సినిమా OG (OG Movie) కూడా లైన్‌లో ఉంది కానీ దానికి కూడా పవన్ డేట్స్ ఇప్పటివరకు క్లారిటీ కాలేదు.
అలాగే హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా మిడిల్ స్టేజ్ లో నిలిచిపోయినట్టే ఉంది. ఈ సినిమా తెరి అనే తమిళ హిట్ సినిమాకు ప్రేరణగా రూపొందుతున్నప్పటికీ, ప్రాజెక్ట్‌కు గట్టి స్పీడ్ అందడం లేదు. ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని (Gopichand Malineni) మరో సినిమా కోసం పవన్‌ను టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.
గోపిచంద్ ఇప్పటికే రవితేజతో (Ravi Teja) క్రాక్ (Krack), బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) , సన్నీ డియోల్‌తో (Sunny Deol) జాట్ (Jaat) వంటి సినిమాలతో మాస్ మార్కెట్ లో తన బ్రాండ్ ను స్ట్రాంగ్ గా నిలిపారు. ఇప్పుడు ఆయన 2026లో పవన్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ప్రాథమిక చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. పవన్ ఇప్పటికే చేయాల్సిన సినిమాలే నిలిపివేసి ఉండగా, కొత్త ప్రాజెక్ట్ మొదలవడం ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో డెఫినిట్‌గా బిజీగా ఉండే పవన్ (Pawan Kalyan) కొత్తగా ఒక మాస్ ఎంటర్టైనర్ చేయడానికి సమయం కేటాయిస్తారా అనే సందేహం ఉంది. అయితే పవన్ గోపిచంద్ కాంబినేషన్ కుదిరితే, అది మాస్ ప్రేక్షకులకు అసలైన ట్రీట్ అవుతుంది. కానీ ఇది గాసిప్ గానే మిగిలిపోతుందా లేక నిజంగా 2026లో సెట్స్ పైకి వస్తుందా అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది.