పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఓజీ (OG Movie) సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కు కొత్త ఊపును ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్, నెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ కిక్ అందించబోతుందనే టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు ముందు విడుదల కావాల్సి ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు.
OG Movie:
ఇటీవల ఓజీలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు రాబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. మొదట ప్రభాస్ (Prabhas) అని, ఆ తర్వాత నాని అని గుసగుసలు వినిపించగా, తాజాగా మరో అద్భుతమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పెషల్ క్యామియో పాత్రను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పోషించబోతున్నారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో రామ్ చరణ్, సుజిత్ మధ్య ఈ క్యామియో గురించి చర్చ జరిగిందట.
తక్కువ కాల్ షీట్లతో ఈ పాత్రను పూర్తి చేయగలమన్న నమ్మకంతో చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజమైతే, బాబాయ్ అబ్బాయి స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానుల కోసం పండగే అవుతుంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అటిట్యూడ్ కలిసిపోతే, ఆ ఎపిసోడ్ థియేటర్లను తగలబడేలా చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి కాంబినేషన్ సినిమా మరింత హైప్ తెచ్చుకోవడం ఖాయం. అయితే ఈ సమాచారం ఇప్పటికి అధికారికంగా ధ్రువీకరించబడలేదు.
టీజర్ లేదా లిరికల్ వీడియో రూపంలో సంక్రాంతి సమయానికి పెద్ద అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఓజీలో సుజిత్ ప్రతీ సన్నివేశాన్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారని వినికిడి. 2025లో ఏ టైమ్ లో విడుదల చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.