‘రాధే శ్యామ్’ చిత్రం నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ మొదలైనప్పుడే ప్రారంభమైంది. ఆ తర్వాత డిలే అవుతూ వచ్చింది. కొంత భాగం షూట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ లో మార్పులు చేశారు దర్శకనిర్మాతలు. అది కూడా ‘సాహో’ ఫలితం వల్ల. దాంతో మళ్ళీ షూటింగ్ కొన్నాళ్ళు ఆగిపోయింది. కరెక్ట్ గా ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసే టైంకి కరోనా వచ్చి మరింత దెబ్బ కొట్టింది. కిందా మీదా పడి షూటింగ్ ను కంప్లీట్ చేశారు. కానీ అప్డేట్ల విషయంలో నిర్మాతలు అభిమానులకి మొహం చాటేస్తూ వచ్చారు.
దాంతో ‘రాధే శ్యామ్’ లో విషయం లేదేమో అందుకే నిర్మాతలు యాక్టివ్ గా అప్డేట్లు ఇవ్వడం లేదని అంతా అనుకున్నారు. కానీ జనవరి 14న రాధే శ్యామ్ విడుదల చేస్తున్నామని వారి ప్రకటించడం ఆ వెంటనే ‘రాధే శ్యామ్’ లో ప్రభాస్ పాత్రల్లో ఒకటైన ‘విక్రమాదిత్య’ ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కానీ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నిన్న ఫ్యాన్స్ పట్టుపట్టి విడుదల చేయుంచుకున్న లిరికల్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. నిజానికి ‘సాహో’ ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పుడు డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్..
‘రాధే శ్యామ్’ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి నిర్మాతలు వాళ్ళని కూల్ చేసిన స్టఫ్ మా దగ్గర ఉందని చెప్పకనే చెప్పారు. కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో.. డిలే లేకుండా చూసుకుంటే ‘రాధే శ్యామ్’ ఫలితం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ‘డియర్ కామ్రేడ్’లో కూడా మంచి పాటలు ఇచ్చిన యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడు. దాంతో అభిమానులు చల్లబడ్డారు.