కోవిడ్ టైంలో రెండు ఓటీటీ హిట్లు అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) .. ఆ తర్వాత ‘ఈటీ'(ఎవ్వరికీ తలవంచడు) అనే మాస్ సినిమా చేశాడు. అది టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించింది. అలా అని పెద్ద హిట్టు కాదు. తాజాగా ‘కంగువా’ ’ (Kanguva) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సూర్య. కచ్చితంగా ఇది తనకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెడుతుంది అని అనుకున్నాడు. ట్రేడ్ సైతం…
Suriya
సూర్య తమిళం నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ‘కంగువా’ ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడంతో.. డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ సినిమా హిట్ అయితే వెంటనే ఓ బాలీవుడ్ సినిమా చేయాలని సూర్య అనుకున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో ‘కర్ణ’ అనే మైథాలజీ మూవీని సెట్ చేసుకున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అనుకుంది. కానీ ‘కంగువా’ రిజల్ట్ ను బట్టి..
ఈ ప్రాజెక్టు రిస్క్ అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాకేష్ ఓం ప్రకాష్ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేశాడు. సూర్య,జ్యోతిక (Jyothika) దంపతులు కూడా ముంబైలో ఇల్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడటంతో వారి బాలీవుడ్ ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది అని చెప్పాలి. ఇక సూర్య తన నెక్స్ట్ సినిమాని కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj)దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలుకానుంది. కొంత బ్రేక్ తర్వాత సూర్య షూటింగ్లో జాయిన్ అవుతాడు.