సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా అది వైరల్ అవ్వడమే కాకుండా… చాలా చర్చలకు దారితీస్తూ.. ఉంటాయి. వాళ్ళు జత చేసే ఫోటోలు కూడా.. వాళ్ళు ఏ అర్థంతో పెట్టారో.. ఆలోచించకుండా ట్రోల్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ సినిమా ప్రమోషన్లలో భాగంగా పెట్టారేమో అని కూడా ఆలోచించరు కొందరు నెటిజన్లు. ఇప్పుడు ఓ హీరోయిన్ విషయంలో ఇలాగే జరుగుతుంది. అయితే ఆమె సినిమా హీరోయిన్ కాదు.. సీరియల్ హీరోయిన్.
జానకి కలగలేదు అనే సీరియల్ అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్ మా…లో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే రోజుల్లో ‘ఈతరం ఇల్లాలు’ పేరుతో స్టార్ మా లోనే ఓ సీరియల్ ప్రసారమయ్యేది..! అయితే అది సూపర్ హిట్ అవ్వడంతో…దానినే మళ్ళీ తెలుగు నేటివిటీకి తగినట్టు ‘జానకి కలగనలేదు’ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు.
సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి ఈ సీరియల్ లో నటిస్తుంది కాబట్టి మొదటి నుండి ఈ సీరియల్ పై క్రేజ్ నెలకొంది . ఇక సీరియల్ జానకి పాత్రలో తన లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రియాంక జైన్. తాజాగా ఆమెకు సీమంతం జరిగినట్టు కొన్ని ఫోటోలు వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. అయితే ఈమెకు పెళ్లి కాలేదు.
మరి ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏంటి అన్ డౌట్ మీకు రావచ్చు. కొంతమంది ఈమెను ట్రోల్ చేస్తుంది కూడా అందుకే..! ఇది కొత్త ఎపిసోడ్ లో భాగంగా చేసిన షూటింగ్ కు సంబంధించినది అని తెలుస్తుంది.డ్రీమ్ ఎపిసోడ్ లో భాగంగా ఇలా ఆమె సీమంతం చేయించుకుంటున్నారు అని తెలుస్తుంది.