Janani Song: ఆర్.ఆర్.ఆర్ : ఆకట్టుకుంటున్న ఎమోషనల్ సాంగ్ జనని..!
- November 26, 2021 / 03:30 PM ISTByFilmy Focus
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ గురించి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం నుండీ వచ్చే అప్డేట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. విడుదల చేసిన ప్రోమోలు, రెండు పాటలు సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దోస్తీ పాట ఎలా ఉన్నా నాటు నాటు పాట అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా మరో పాటని కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.
‘ జనని ‘ అంటూ సాగే ఈ పాటలో చాలా ఎమోషన్ ఉందని రాజమౌళి చెప్పకనే చెప్పారు. ఈ పాటలో చరణ్, ఎన్టీఆర్ లతో పాటు అజయ్ దేవగన్, శ్రీయ, హీరోయిన్లు అలియా భట్ వంటి వారు కూడా ఈ పాటలో కనిపిస్తున్నారు. అజయ్ దేవగన్ … శ్రీయ మధ్య ఎమోషనల్ సంభాషణలను కూడా చూపించారు. కీరవాణి ఈ పాటకి ట్యూన్ అందించడమే కాకుండా లిరిక్స్ కూడా అందించారు. అలాగే ఆయన ఈ పాటని చొరస్ తో కలిసి పాడారు.

నిజంగానే ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగింది. అదే సమయంలో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జనని ఎమోషన్ ను ఫీల్ అవ్వండి :
నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

















