ఈ మధ్య నాగబాబు ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎదో ఒక వర్గాన్ని గిల్లేలా ఆయన ట్వీట్స్ ఉంటున్న నేపథ్యంలో అవి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోతున్నాయి. గాంధీ, గాడ్సే, హిందూయిజం వంటి అనేక విషయాలపై నాగబాబు ట్వీట్స్ వేశారు. రోజూ ఎదో ఒక విషయాన్ని ఆయన గెలుకుతున్నారు. ఐతే ఈ మధ్య ఆయన వేసిన కొన్ని ట్వీట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలకు మద్దతు పలుకుతున్నట్లుగా ఉన్నాయి.
టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబుకు భజన చేస్తుందని, ఆయన ఉప్పుతిన్న విశ్వాసానికి ఆయనపై ప్రేమ చూపిస్తున్నాయని, ఆయన కోసం అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇలాంటి వాళ్లకు జగన్ లాంటోడే కరెక్ట్ అనిపిస్తుంది అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ఆయన తాజా అరెస్ట్ లను ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మా జనసైనికులను అక్రమంగా అరెస్ట్ చేసి, గొడ్డునుబాదినట్టు బాదారని, అవినీతి చేసినవాడిని అరెస్ట్ చేస్తే తప్పేముంది అన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది.
ఈ రెండు సంధర్భాలలో జగన్ కి మద్దతు తెలిపినట్లు నాగబాబు ట్వీట్ ఉన్న తరుణంలో జనసైనికులే ఆయనపై అసహనంతో ఉన్నారని తెలుస్తుంది. జగన్ ని తీవ్రంగా వ్యతిరేకించే పవన్ అభిమానులుగా ఇది వారికి నచ్చడం లేదట. ఇక నాగబాబు ట్వీట్స్ కూడా పవన్ కి తలనొప్పిగా మారాయి. ఆయన గతంలో వేసిన ట్వీట్ నాగబాబు వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదని పవన్ అధికారిక లెటర్ విడుదల చేశారు.