Janhvi Kapoor: టాలీవుడ్ హీరోలపై జాన్వీ కన్ను.. నెక్స్ట్ వారితోనే..!
- April 21, 2025 / 02:49 PM ISTByFilmy Focus Desk
శ్రీదేవి (Sridevi) వారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్‌తో (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, అదే ప్రాజెక్ట్ సీక్వెల్ అయిన ‘దేవర 2’లోనూ కొనసాగనుంది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) లోనూ ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్సులు వరుసగా అందుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోలతో జాన్వీ హవా మొదలైంది.
Janhvi Kapoor

ఇప్పుడు ఆమె టార్గెట్ లో మరికొందరు తెలుగు స్టార్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం అల్లు అర్జున్ 22వ చిత్రంలో జాన్వీనే హీరోయిన్‌గా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమెకు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్ ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఈ అవకాశం పట్టిందంటే జాన్వీ టాలీవుడ్ లో మరింత బలంగా నిలబడే అవకాశం ఉంది.ఇంకా ఆమె టార్గెట్‌లో ఉన్న హీరోలు మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్(Prabhas).

వీరిద్దరితో ఇప్పటి వరకు ఆమెకు అవకాశం రాకపోయినా, రానున్న సినిమాల్లో చాన్స్ ఉండవచ్చని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరు వినిపించినా, మరో లీడ్ పాత్రకు జాన్వీ అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ‘పౌజీ’, ‘రాజా సాబ్’ (The Raja saab) వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా, ఆయన తదుపరి సినిమాల్లో జాన్వీ పేరును పరిశీలనలో పెట్టినట్లు టాక్. ప్రభాస్ వంటి మాస్ హీరోకు జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా సెట్ అవుతుంది అన్నదే ఆసక్తికర అంశం.
కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో.. తెలుగు ప్రేక్షకులకు ఈసారి కనెక్ట్ అవుతాడా?

కానీ యంగ్ స్టార్ హీరోయిన్‌గా ఆమెకు ఉన్న గ్లామర్, ఫాలోయింగ్, బాలీవుడ్ బ్యాకింగ్ ఈ అవకాశాన్ని కలిపేలా మారుతాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, చరణ్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun), మహేష్ బాబు, ప్రభాస్‌లతో చేయాలని ప్లాన్ చేస్తున్న జాన్వీకి ఈ లక్ష్యాలు నెరవేరితే, ఆమె టాలీవుడ్ మిషన్ పూర్తైనట్లే. టాలెంట్‌తో పాటు తెరపై అందాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయగల ఈ మిల్కీ బ్యూటీ, టాలీవుడ్ టాప్ హీరోలతో హిట్స్ అందుకుంటే పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ వన్ కు చేరడం కాయం.

















