ఉదయం నుండి జానీ మాస్టర్ పేరు రకరకాలుగా వినిపిస్తుంది. జానీ మాస్టర్ (Jani Master) తో కలిసి పని చేసిన 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక వేధింపుల కేస్ వేసింది. దాంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై POSH యాక్ట్ మరియు రేప్ కేస్ నమోదయ్యాయి. దాంతో.. జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన హేట్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఈ కేస్ విషయం బయటపడినప్పటికీ, జానీ మాస్టర్ పరారీలో ఉండడం పెద్ద స్థాయి చర్చకు దారి తీసింది. జానీ మాస్టర్ తప్పు చేయలేదేమో అనే కొద్దిపాటి అనుమానాలను కూడా అతను పరారీలో ఉండడం తుడిచిపెట్టేసింది.
Jani Master
ఇకపోతే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేన పార్టీ ఉన్నపళంగా జానీ మాస్టర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. సో, ఒకవేళ ఈ కేస్ గనుక సీరియస్ అయితే ఎలాగూ ఇండస్ట్రీ నుండి సపోర్ట్ ఉండదు, ఇక పొలిటికల్ గాను సపోర్ట్ కోల్పోవడంతో జానీ మాస్టర్ పరిస్థితి బాగా రిస్క్ లో పడినట్లే.
అసలే కేరళలో హేమా కమిటీ రచ్చ యావత్ సినీ పరిశ్రమను హడలు పుట్టిస్తున్న తరుణంలో జానీ మాస్టర్(Jani Master) మీద నమోదైన కేసులపై తీవ్రమైన పరిణామాలు ఉండడం ఖాయం. మరి జానీ మాస్టర్ ఇలానే పరారీలో ఉంటూ ఈ కేసును మరింత ముదిరే దాకా తెచ్చుకుంటాడో లేక ఇప్పటికైనా మీడియా ముందుకో పోలీసుల ముందుకో వచ్చి ఈ రచ్చకు ఒక ముగింపు పలుకుతాడో చూడాలి.
అయితే.. జానీ మాస్టర్ మీద నమోదైన ఈ కేసుల విషయంలో కొరియోగ్రాఫర్స్ యూనియన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వాళ్లు కూడా జానీ మాస్టర్ అధ్యక్ష పదవిని సస్పెండ్ చేయడంతోపాటు, అసోసియేషన్ నుండి వైదొలగించే అవకాశాలు ఉన్నాయి. అలా కూడా జరిగితే జానీ మాస్టర్ భవిష్యత్ లో మళ్ళీ ఎవరికీ ముఖం చూపించుకోలేడు. ఇకపోతే.. ఈ రచ్చ మొత్తం జానీ మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డ్ వచ్చాక జరగడం బాధాకరం!