బుల్లితెర పై నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క ప్రతీ సినిమా వేడుకలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన సుమ కనకాల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. గత శుక్రవారం అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. దర్శకుడు మంచి పాయింట్ ను అలాగే ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని నేటివిటీతో ఈ చిత్రాన్ని రూపొందించినా కథనం వీక్ గా ఉండడంతో ఫలితం తేడా కొట్టింది.
ఓపెనింగ్స్ విషయంలో ఓకె అనిపించిన ఈ చిత్రం వీకెండ్ తర్వాత వాషౌట్ అయిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.33 cr
సీడెడ్
0.14 cr
ఉత్తరాంధ్ర
0.15 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.10 cr
కృష్ణా
0.08 cr
నెల్లూరు
0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.00 cr
‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి రూ.3.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్లో ఈ మూవీ రూ.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొదటి రోజు కొంతవరకు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత ఆ జోరుని కొనసాగించలేకపోయింది.
పోటీగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘భళా తందనాన’ వంటి సినిమాలు ఉండడం ఇక ఈ వారం ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమా రావడంతో ‘జయమ్మ’ బాక్సాఫీస్ రన్ ముగిసింది. బిజినెస్ మీద ఈ మూవీ రూ.2.45 కోట్ల నష్టాల్ని మిగిల్చింది.