మెల్లమెల్లగా హీరోలందరూ బిజినెస్సుల్లోకి దిగుతున్నారు. ఆల్రెడీ ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఆల్రెడీ ప్రొడక్షన్ హౌజ్ లు స్థాపించి ఆల్రెడీ బిజినెస్ లోకి దిగిపోయారు. ఇప్పుడు నాని వంతు. అయితే.. నాని బాబు మాంచి గట్టి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. అదేమిటంటే.. స్టూడియో నిర్మాణం. ఆల్రెడీ రామోజీ ఫిలిమ్ సిటీ, రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నప్పుడు ఈ కొత్త స్టూడియో ఎందుకు అనుకుంటున్నారా?. అయితే.. నాని మొదలెట్టబోయేది రెగ్యులర్ స్టూడియో కాదు..
రీడిజైనబుల్ సెట్స్. ఇప్పుడు హాస్పిటల్, పోలీస్ స్టేషన్, జైల్, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇలా అన్నీ రకాల స్టూడియోస్ ప్లగ్ & ప్లే తరహాలో ఉంటాయన్నమాట. సినిమా యూనిట్ కేవలం చిన్న చిన్న మార్పులతో షూటింగ్స్ చేసేసుకోవచ్చు. ఈ స్టూడియో బిజినెస్ కోసం నాని ఒక అద్భుతమైన పార్ట్నర్ ను కూడా సెలక్ట్ చేసుకొన్నాడు. ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు హైద్రాబాద్ లో బోలెడు ల్యాండ్స్ ఉన్నాయి.
ఆ ల్యాండ్స్ లోనే పార్ట్నర్ షిప్ తో నాని-ఎన్టీఆర్ కలిసి ఈ బిజినెస్ ను మొదలెట్టానున్నారని వినికిడి. మరి ఈ వ్యవహారం రూపుదాల్చడానికి ఎంత సమయం పడుతుంది అనేది తెలియదు కానీ.. ఈ ఇద్దరూ కలిసి బిజినెస్ మొదలెట్టానున్నారనే వార్తే పెద్ద సంచలనంగా మారింది. ఈ ఇద్దరూ కలిసి ప్రారంభించే ఈ బిజినెస్ ప్రస్తుత లాక్ డౌన్ మరియు ఫారిన్ లొకేషన్స్ కి షూటింగ్ కోసం వెళ్ళే అవకాశాలు లేకపోవడం వల్ల ఈ స్టూడియో ఐడియా భీభత్సమైన సక్సెస్ అవుతుంది. మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వేరే హీరోలు, నటుడు ఈ బిజినెస్ లోకి దూకుతారేమో చూడాలి.