ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్3 హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిగా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్న తారక్ ఈ సినిమాలోని కొమరం భీమ్ పాత్రకు తన నటనతో ప్రాణం పోశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి కొంతమేర తక్కువే అయినా ఎక్కడా తగ్గకుండా తారక్ బ్యాలెన్స్ చేశారు. తన యాక్టింగ్ స్కిల్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించారనే చెప్పాలి.
అయితే తారక్ కుటుంబానికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటంతో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తారక్ కు రాజకీయాలపై కెరీర్ తొలినాళ్లలో ఆసక్తి ఉన్నా ఇప్పుడు మాత్రం సినీ కెరీర్ పై ఫుల్ ఫోకస్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని ఫ్యాన్స్ ఆకాంక్ష కాగా తాజాగా మరోమారు నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లెక్సీలు దర్శనమివ్వగా ఈ ఫ్లెక్సీలు ఎన్టీఅర్ అభిమానులు ఏర్పాటు చేసినవి కావని మరో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినవని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు వైరల్ అయిన ప్రతి సందర్భంలో తారక్ సీఎం ఆయితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాత స్థాపించిన పార్టీకి న్యాయం చేసేది తారక్ మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికలకు సమయం కొంతకాలమే ఉన్న నేపథ్యంలో (Jr NTR) తారక్ టీడీపీకి బహిరంగంగా మద్దతు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు అనుకూలంగా జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్కులు చెప్పిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. మరోవైపు తారక్ దేవర మూవీ షూట్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది.