దర్శకుడు రాజమౌళి కి అలాగే నిర్మాత డి.వి.వి దానయ్యకు కూడా కరోనా సోకడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పట్లో ‘ఆర్.ఆర్.ఆర్’ పై ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అని. ఎలాగూ అది 2022 లోనే విడుదలవుంతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఎన్టీఆర్.. కొమరం భీమ్ లుక్ కు సంబంధించిన వీడియో రిలీజ్ కాలేదు అనే అభిమానులు ఎక్కువ ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా… ఈ లాక్ డౌన్ టైం ఎన్టీఆర్ కు చాలా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే మలయాళం లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మలయాళ వెర్షన్ కు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలి అని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ ఎలాగు బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్.
ఈ లాక్ డౌన్ టైములో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఫోన్ లో టచ్ లో ఉంటూ స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడట ఎన్టీఆర్. కథలో కొన్ని కీలక మార్పులు చెయ్యమని కూడా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ను కోరాడట. ఏమైనా ఈ లాక్ డౌన్ టైం ను ఎన్టీఆర్ బాగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి.