NTR 31: భీకరమైన నలుపులో ఎన్టీఆర్ పోస్టర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తరువాత సోలోగా పాన్ ఇండియా ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. RRR సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టినప్పటికి కూడా ఆ సక్సెస్ లో రామ్ చరణ్ కూడా ఉన్నాడు కాబట్టి తదుపరి సినిమాతో మాత్రం ఎలాగైనా సోలోగా పాన్ ఇండియా విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివతో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

NTR30 కి సంబంధించిన మోషన్ పోస్టర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఎన్టీఆర్ 31 వ ప్రాజెక్ట్ పై పడింది. ఇక అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నట్లే ఎన్టీఆర్ భీకరమైన లుక్ తో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్టర్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపులో కనిపిస్తున్నాడు.

మళ్ళీ KGF సలార్ లాంటి ఫార్మాట్ లోనే ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ అయితే ఇప్పట్లో స్టార్ట్ అవ్వదట. 2023 ఏప్రిల్ లోనే ఎన్టీఆర్ 31 షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన. మరికొన్ని. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ కావాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఆ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.