Jr NTR, Pawan Kalyan: ఆ సినిమా ఇష్టమంటున్న యంగ్ టైగర్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర స్టార్ హీరోలతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ద్వారా తారక్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు. ఈ షో చివరి ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరు కానున్నారు.

తాజాగా ఎన్టీఆర్ ఒక కంటెస్టెంట్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో తొలిప్రేమ సినిమా అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. 1998 సంవత్సరంలో పవన్ నటించిన తొలిప్రేమ రిలీజ్ కాగా కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పవన్, కీర్తి రెడ్డి ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ప్యూర్ లవ్ స్టోరీ అయిన తొలిప్రేమ పవన్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. పవన్ సినిమా గురించి ఎన్టీఆర్ పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో పవన్ ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.

మెగా హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది. చరణ్, ఎన్టీఅర్ కలిసి సినిమా చేస్తుండగా బన్నీని ఎన్టీఆర్ బావా అని పిలుస్తారనే విషయం తెలిసిందే. స్టార్ హీరోలు ఒకరి సినిమాల గురించి మరొకరు పాజిటివ్ గా చెబుతుండటంతో అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. స్టార్ హీరోలు ఒకరి సినిమాలకు మరొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.