చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజం లేదని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని అనుకుంటే ఎప్పుడో స్పందించేవారని భోగట్టా. గతంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాల వల్ల తారక్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారని
అంతకు మించి చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని సమాచారం అందుతోంది. రాజకీయాలకు సంబంధించిన విషయాలలో తారక్ జోక్యం చేసుకునే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతుండటం గమనార్హం. సినిమాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యమని ప్రస్తుతం ఆ దిశగానే తారక్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం దేవర సక్సెస్ సాధించడంపై ఫోకస్ పెట్టారని సమాచారం.
త్వరలో దేవర షూటింగ్ తో బిజీ కానున్న తారక్ నవంబర్ చివరి నాటికి దేవర షూటింగ్ ను పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు కమర్షియల్ గా అద్భుతాలు చేస్తూనే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తర్వాత సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. తారక్ ప్రశాంత్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో చాలా ప్రాజెక్ట్ లకు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం గమనార్హం.