యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినీ కెరీర్ లో, పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినీ కెరీర్ లో టెంపర్ (Temper) సినిమా ప్రత్యేకం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ ఇటు పూరీ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమాకు వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ తాను చెయ్యలేనని మొదట ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కు చెప్పారట.
టెంపర్ ముందు వరకు తారక్ అన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్స్ లోనే నటించారు. ఈ సినిమాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తనికెళ్ల భరణిని ఆస్తికి సంబంధించి ఇబ్బంది పెట్టి ఆయన స్థలం లాక్కునే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ లో నటిస్తే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో అని ఫీలైన తారక్ అదే విషయాన్ని పూరీ జగన్నాథ్ దగ్గర ప్రస్తావించారట. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం రాక్షసుడు గొప్పవాడిగా మారే కథాంశంతో ఈ సినిమా తీస్తున్నామని ఆ సీన్ లో నటించాలని చెప్పారట.
టెంపర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఊహించినట్టే ఫస్ట్ హాఫ్ విషయంలో ఒకింత నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే టెంపర్ సెకండాఫ్ లో ప్రతి సీన్ అద్భుతంగా ఉండటం, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం సినిమాకు ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లోని సీన్లను సెకండాఫ్ హాఫ్ లోని సీన్లకు ఇంటర్ లింక్ చేస్తూ పూరీ జగన్నాథ్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
టెంపర్ మూవీ అప్పట్లోనే 43 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సాధించింది. తనకు మంచి లాభాలను అందించిన సినిమా టెంపర్ అని బండ్ల గణేష్ (Bandla Ganesh Babu) చాలా సందర్భాల్లో వెల్లడించడం గమనార్హం. ఎన్టీఆర్ కెరీర్ లో సీక్వెల్ తెరకెక్కించగల కంటెంట్ ఉన్న సినిమాల్లో టెంపర్ ఒకటి. భవిష్యత్తులో ఈ సినిమా సీక్వెల్ దిశగా అడుగులు పడతాయేమో తెలియాల్సి ఉంది.