టాలీవుడ్లో ‘దేవర’ (Devara) మరో ‘బాహుబలి’ (Baahubali) అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నుండీ రాబోతున్న సినిమా ఇది. ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) తర్వాత అంటే దాదాపు 6 ఏళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్.. ఈ సినిమా రిజల్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.
ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ వంటివి కూడా రిలీజ్ అయ్యాయి. వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా కథ ఏంటి? ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా వెంటాడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఫస్ట్ పార్ట్ లో దేవర ఎంట్రీ ఉండదట? అంటే మెయిన్ రోల్ అనమాట.
గ్లింప్స్ లో మనకి చూపించిన ఎర్ర సముద్రం, డార్క్ బ్యాక్ డ్రాప్, షిప్ లో దొంగలు పడటం.. వంటివి అన్నీ ఫస్ట్ పార్ట్ లో కనిపించవట. క్లైమాక్స్ లో పెద్ద ఎన్టీఆర్ పాత్ర రివీల్ అవుతుందట. దాదాపు 45 నిమిషాల వరకు ఆ పాత్ర కనిపిస్తుందని. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చేలా ఓ ట్విస్ట్ కూడా ఆ పాత్రతో ముడిపడి ఉంటుందని సమాచారం.