దర్శకధీరుడు రాజమౌళి 11 సినిమాలు తెరకెక్కిస్తే అందులో 9 సినిమాలు కథలు రాసింది ఆయన తండ్రి కే విజయేంద్ర ప్రసాద్ గారే. మరో సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా తండ్రి సలహాలు తీసుకోకుండా అస్సలు ఉండలేడు. రాజమౌళి ఏదైనా పొరపాటు చేస్తున్నాడు అనినిపిస్తే మొహం మీద చెప్పేస్తారట. కెరీర్ మొదటి నుంచి కూడా రాజమౌళి తండ్రిని బాగానే ఫాలో అవుతున్నాడు.
అయితే బజరంగీ భాయిజాన్, బాహుబలి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బాక్సాఫీస్ సినిమాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ ఎలాంటి పారితోషికం అందుకుంటాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కొన్ని కథనాల ప్రకారం ప్రస్తుతం ఇండియాలో లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం పై స్పందించిన రైటర్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.నాకు అత్యధిక రెమ్యునరేషన్ అని నేను అనుకోవడం
లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అని తెలిస్తే అప్పుడు అది ఎక్కువ తక్కువ అనేది నాకు అర్థమవుతుంది. ఆ విషయమే తెలియనప్పుడు నాకు ఎక్కువ ఇస్తున్నారు అని నాకు ఎలా తెలుస్తుంది అని తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సీతమ్మ తల్లి పై ఒక ఒక కథ రెడీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చిన విజయేంద్రప్రసాద్ అలాగే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్న ఒక స్కూల్ టీచర్ పై బయోపిక్ కథను రెడీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.