Kaikala Satyanarayana: హాస్పిటల్ పాలైన టాలీవుడ్ నటుడు కైకాల.. ఆందోళనలో టాలీవుడ్..!
- November 20, 2021 / 02:15 PM ISTByFilmy Focus
ప్రముఖ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ అందరికీ సుపరిచితమే.దాదాపు 60 ఏళ్ళుగా ఆయన సినీ పరిశ్రమలో కొనసాగారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దాంతో జూబ్లీ హిల్స్ లో ఉన్న అపోలో ఆసుపత్రిలో ఆయన్ని అడ్మిట్ చేసారు కుటుంబ సభ్యులు.ప్రస్తుతం ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు…!కొద్ది రోజుల క్రితం కైకాల సత్యనారాయణ తన ఇంట్లో కాలు జారి పడిపోయారు. ఆ టైములో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు.
తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేసేసారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్ళీ విషమించింది. ఈ విషయం బయటకి రాగానే టాలీవుడ్ లో ఆందోళన వాతావరణం నెలకొంది. సత్యనారాయణ కోలుకొని మన మధ్యకు తిరిగి రావాలని పలువురు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.1959 లో సిపాయి కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కైకాల సత్యనారాయణ…మొదట్లో హీరోగా పలు సినిమాల్లో నటించి అనంతరం ఎన్నో విలక్షణమైన పాత్రలతో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా కూడా ఎన్నో సినిమాల్లో చేశారు. ఆయన సూపర్ హిట్ మూవీ ‘అడవి రాముడు’ కి ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఆయన 777 సినిమాల్లో నటించారు. 2019 లో వచ్చిన మహేష్ బాబు ‘మహర్షి’ లో ఈయన కూడా చిన్న పాత్ర పోషించారు.
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!














